అన్నా హజారే దీక్షపై ప్రధాని మన్మోహన్ చురక

ఏ విధమైన లోక్‌పాల్ చట్టం తేవాలనే విషయంపై పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుత బిల్లుపై భేదాభిప్రాయాలు ఉన్న విషయం తనకు తెలుసునని, ప్రస్తుత బిల్లును అంగీకరించనివారు పార్లమెంటులో, మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలని ఆయన అన్నారు. వారు నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టబోరని తాను నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. భూ సేకరణ, నక్సలిజం, ఉగ్రవాదం, ఆర్థికం వంటి పలు అంశాలను మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో స్పృశించారు.












Click it and Unblock the Notifications