హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు జోష్: వైయస్ జగన్ పరేషాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం తలపెట్టిన సామాజిక కార్యకర్త అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిలో జోష్ పెరగగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరేషాన్‌లో పడ్డారు. అన్నా హజారే అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో అవినీతి వ్యతిరేక పోరాటానికి చాంపియన్‌ అయ్యేందుకు చంద్రబాబు వీధుల మీదికి వచ్చారు. అన్నా హజారే అరెస్టుపై కేంద్ర ప్రభుత్వం మీద అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అన్నా హజారే పోరు చంద్రబాబుకు చాలా రకాలుగా కలిసి వచ్చినట్లయింది. పార్టీని కలవరపెడుతున్న తెలంగాణ ఉద్యమం తగ్గుముఖం పట్టే అవకాశాలు రావడం అందులో ఒకటి. వైయస్ జగన్‌పై ఆధిక్యత సాధించడానికి ఈ ఉద్యమం చంద్రబాబుకు కలిసి వచ్చిందనే చెప్పాలి. జగన్ అవినీతిపై చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.

కాగా, అన్నా హజారే అరెస్టును ఖండించలేక, అవినీతికి వ్యతిరేకంగా తలపెట్టిన పోరాటాన్ని సమర్థించలేక వైయస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు. జగన్ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం అందుకు ప్రధాన కారణం. పైగా, జగన్ అవినీతి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. దాన్ని శిరసావహించకుండా వైయస్ జగన్ సుప్రంకోర్టుకు వెళ్తున్నారు. దీంతో అన్నా హజారే అరెస్టు ఖండించేందుకు, అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలిపేందుకు జగన్ వెనకాడాల్సి వస్తోంది. ఓ పార్టీ అధినేతగా తన వైఖరిని చెప్పలేని నిస్సహాయ స్థితిలో జగన్ పడ్డారని అంటున్నారు.

English summary
TDP president N Chandrababu is taking advantage of Anna Hazare's episode. YSR Congress president YS Jagan is not in position to talk about Anna Hazare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X