కోమటిరెడ్డి డుమ్మా, తెలంగాణ మంత్రులు హాజరు

తన కన్ను సరిగా లేనందున మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావడం లేదని పి. శంకరరావు ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. సారయ్య ఎందుకు హాజరు కాలేదనేది తెలియడం లేదు. కె. జానారెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ, రాంరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ వంటి తెలంగాణ మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ మంత్రులను మంత్రివర్గ సమావేశానికి రప్పించడం ద్వారా ముఖ్యమంత్రి విజయం సాధించారని భావిస్తున్నారు. సచివాలయంలో కాకుండా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తే మంత్రి వర్గ సమావేశానికి వస్తామని తెలంగాణ మంత్రులు చెప్పారు. ఆ మేరకు సమావేశానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications