తెలంగాణపై కిరణ్ కుమార్‌కు జానా రెడ్డి చిట్కాలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశానికి తెలంగాణకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శంకరరావు మినహా మిగతా మంత్రులంతా హాజరయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కచ్చితమైన వైఖరితోనే మంత్రి వర్గ సమావేశాన్ని బహిష్కరించారు. శంకరరావు మాత్రం తన కంటికి శస్త్రచికిత్స జరిగినందున రాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి చెప్పారు. మంత్రి వర్గ సమావేశం నిర్ణయాలను తెలంగాణకు చెంది సమాచార, పౌర సంబంధాల మంత్రి డికె అరుణ మీడియాకు వివరించారు. ఆ రకంగా జానా చిట్కా పని చేసిందని అంటున్నారు. జానా రెడ్డి తీరును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications