వైయస్ జగన్ ఇంటిపై, సంస్థలపై దాడులు షురూ

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో, ఆయన సంస్థల్లో సోదాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయమే సిబిఐ అధికారులు సోదాలకు శ్రీకారం చుట్టారు. లోటస్ పాండ్‌లో వైయస్ జగన్ నివాసంలో 11 మంది అధికారులతో కూడిన బృందం సోదాలు చేసింది. హైదరాబాదు బంజారాహిల్స్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయంపై కూడా సిబిఐ అధికారులు దాడి చేశారు.

సిబిఐ అధికారులు 12 బృందాలుగా విడిపోయి 28 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందంలో ఆరుగురు అధికారులు ఉన్నారు. మహేంద్రహిల్స్‌లోని ఐఎఎస్ అధికారి ఆచార్య నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాదులోని సైనిక్‌పురిలో గల నిమ్మగడ్డ ప్రసాద్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌పై కూడా సోదాలు ప్రారంభమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+