జనగ్ జైలుకెళ్తాడో, లేదో చెప్పలేను: జెసి దివాకర్ రెడ్డి

JC Diwakar Reddy
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడో, లేదో తాను చెప్పలేనని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. జగన్‌పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కక్ష లేదని, హైకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ దర్యాప్తు జరుగుతోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్‌పై కాంగ్రెసు పార్టీ ఆరేళ్ల పాటు మౌనం వహించన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. జగన్ వ్యవహారాల్లో తమ కాంగ్రెసు పార్టీ ప్రమేయం ఉందో, లేదో దర్యాప్తులో తేలుతుందని ఆయన అన్నారు. అవసరమైతే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఇంటిపై కూడా సిబిఐ దాడులు జరుగుతాయని ఆయన అన్నారు. జగన్ ఆరోపణల నుంచి బయటపడి కాంగ్రెసులోకి రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

కుట్ర కారణంగానే జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. జగన్ వ్యతిరేకులదని తాత్కాలిక ఆనందమేనని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆస్కార్ స్థాయి సినిమా నడుస్తోందని, స్క్రీన్‌ప్లే బ్రహ్మాండంగా ఉందని ఆయన అన్నారు. సినిమాలో విలన్లు ఎవరైనా హీరోదే విజయమని ఆయన అన్నారు. శుభం కార్డు పడుతుందని ఆయన అన్నారు.

కాగా, దమ్ముంటే మంత్రులు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యులు కొండా సురేఖ సవాల్ చేశారు. నాటి మంత్రివర్గంలోని సభ్యులంతా స్వచ్ఛందంగా సిబిఐ విచారణకు సిద్ధపడాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్‌పై అభియోగాలు సరి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. తప్పించుకోవడానికే వైయస్ జగన్ మంత్రి వర్గ సభ్యులను లాగుతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్సించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+