జగన్ చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేసుకున్నారు?

Chandrababu Naidu
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, కృష్ణా జిల్లా చందర్లపాడు ఓదార్పు యాత్ర సభలో గురువారం రాత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై సిబిఐ కేసులు, సోదాల నేపథ్యంలో కాస్తా కలత చెందినట్లు కనిపించిన జగన్ చంద్రబాబుపై, కాంగ్రెసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండెకరలా ఆస్తులు ఉన్న చంద్రబాబు వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. తనపై జరుగుతున్న సిబిఐ సోదాల నుంచి దృష్టిని మళ్లించి, తానొక్కడినే కాదు అనే అభిప్రాయాన్ని బలంగా ఆయన ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

సిగ్గు లేకుండా చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని, తనపై రాజకీయంగా కుట్ర చేశారని ఆయన అంటున్నారు. మరణించినప్పటికీ వైయస్ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు సిద్ధపడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. మాట నిలబడాలని తనకు వైయస్సార్ నేర్పించారని ఆయన చెప్పుకుంటున్నారు. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆయన అంటున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని సీమాంధ్రలో కూకటివేళ్లతో సహా పెకిలించే ఉద్దేశంతోనే కాకుండా తనను ఒంటరి చేసి రాజకీయంగా దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజల్లో సానుభూతి పొందడం కూడా ఆయన వ్యాఖ్యల్లోని అంతరార్థంగా చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+