ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి

చంద్రబాబు రాజకీయాలు చూసుకుంటున్న సమయంలో ఆమె హెరిటేజ్ కార్యకలాపాలు చూసుకునే వారు. అందుకోసం అప్పుడప్పుడు హెరిటేజ్ కార్యాలయానికి వచ్చే వారు. అయితే ఇటీవల లోకేష్ కుమార్ హెరిటేజ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ రాక కూడా తగ్గింది. ఎన్టీఆర్ కూతుళ్లలో ఇప్పటి వరకు కేవలం పురంధేశ్వరి మాత్రమే పూర్తి రాజకీయాల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఇటీవల తరుచూ రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇటీవల బాబు తనయుడు లోకేష్ కుమార్ పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎన్టీఆర్ కుటుంబంలో చర్చానీయాంశంగా మారిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications