వైయస్ అల్లుడు అనిల్ బ్రదర్ ఆఫీసుపై దాడులు

అలాగే, సికింద్రాబాదులోని నిమ్మగడ్డ ప్రసాద్ ఫౌండేషన్ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. గురువారంనాడు జగన్ సంస్థల్లో, ఇళ్లలో తనిఖీలు చేసిన సిబిఐ అధికారులు శుక్రవారం జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలపై దృష్టి కేంద్రీకరించారు. పెన్నా సిమెంట్స్ కార్యాలయంలో, ఆ సంస్థ అధినేత ఇంటిలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాన్‌పిక్ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. నవభారత్ వెంచర్స్, కన్‌స్ట్రక్షన్ కార్యాలయాల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. సిబిఐ అధికారులు శుక్రవారం ఉదయం ఆరు బృందాలుగా దిల్‌కుషా అతిథి గృహం నుంచి బయలుదేరి సోదాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications