హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ బాపూజీ నిన్న లగడపాటి, నేడు జెసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal-JC Diwakar Reddy
హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం ప్రయత్నిస్తున్న స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీని సమైక్యావాది అయిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కలుసుకోవడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇంతకు ముందు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆయనను కలుసుకున్నారు. ఇప్పుడు జెసి భేటీ కావడం వల్ల ఏం జరుగుతోందనే విషయంపై ఉత్కంఠ చెలరేగుతోంది. లగడపాటి, దివాకర్ రెడ్డిలతో తాను సమావేశమైనంత మాత్రాన వారి దగ్గర ఏదో డబ్బులు తీసుకుని ఉద్యమాన్ని తప్పు దోవ పట్టిస్తున్నానని కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని భేటీ అనంతరం గురువారం రాత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. ఇరు ప్రాంతాల నాయకులతో చర్చలు జరిపి తగిన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

చట్టబద్దంగా కాకుండా మానవతా దృక్పథంతో నీటిని కేటాయిస్తే తెలంగాణ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. రాయలసీమ అభివృద్ధి చెందితే హైదరాబాదులను ఎన్నింటైనా నిర్మించుకోగలమని ఆయన అన్నారు. తెలంగాణ వెనకబడిన ప్రాంతమని, పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయడంలో అప్పటి నాయకులు వివక్ష చూపారని ఆయన అన్నారు. శాంతియుత చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Congress MLA from Rayalaseema met Telangana freedom fighter Konda Laxman Bapuji.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X