హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు: జీవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jeevitha
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే ఉద్యమం కారణంగా దేశంలో అవినీతి అంటే భయపడే పరిస్థితి వచ్చిందని నిర్మాత, దర్శకురాలు జీవిత శుక్రవారం అన్నారు. వైయస్సార్సీ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తులు జరగడం మంచిదే అన్నారు. అయినా జగన్ ఒక్కరు మాత్రమే కాకుండా చాలామంది అవినీతిపరులు ఉన్నారని ఆమె అన్నారు. అవినీతిపరులను అందరినీ బయటకు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అన్నాహజారే చెప్పినట్టు పార్లమెంటులో జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు.

అన్నాహజారేకు మద్దతుగా చిత్రపరిశ్రమ శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జీవిత, హాస్య నటుడు అలీ, పలువురు నటీనటులు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు పాల్గొన్నారు. వారు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. నల్లధనం బయటకు వస్తే పేదవాడికి తెల్లధనం దొరుకుతుందని, అవినీతిని కలిసికట్టుగా నిర్మూలిద్దాం అనే బ్యానర్లను ప్రదర్శించారు.

English summary
Jeevitha accused YSRC party president YS Jaganmohan Reddy today in cine industry Anna Hazare support rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X