హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచివాలయానికి సబిత, తెలంగాణ మంత్రల బాట అదే

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: తెలంగాణ కోసం రాజీనామాలు చేసి విధులను బహిష్కరించిన తెలంగాణ మంత్రులు సచివాలయం బాట పట్టారు. శుక్రవారం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి 45 రోజుల తర్వాత సచివాలయానికి వచ్చారు. మిగతా తెలంగాణ మంత్రులు కూడా సచివాలయంలో తమ విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 16వ తేదీన సిఎం క్యాంపు కార్యాలయంలో మంత్రివర్గ సమావేశానికి కోమటిరెడ్డి, పి. శంకరరావు మినహా మిగతా తెలంగాణ మంత్రులంతా హాజరయ్యారు. శంకరరావు తన కంటి ఆపరేషన్ వల్ల హాజరు కాలేదు. కోమటిరెడ్డి మాత్రం తెలంగాణ అంశంపైనే మంత్రివర్గ సమావేశాన్ని బహిష్కరించారు.

కాగా, ప్రభుత్వం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటే పార్లమెంటుకు వెళ్లి ఓటింగులో పాల్గొనాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. తెలంగాణపై ఇచ్చిన హామీకి పార్టీ హైకమాండ్ కట్టుబడి ఉండాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తమ పార్లమెంటు సభ్యులంతా ఒకే మాట మీద ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణకు తమ శాశ్వత మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.

తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ముందు సీమాంధ్రులు తెలంగాణ ఎందుకు వద్దనే విషయంపై సరైన వాదన పెట్టలేకపోయారని మరో పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. జలవనరుల పంపకంపై వారిచ్చిన ప్రజంటేషన్ నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు. గుంటూరు - ఒంగోలు మధ్య సీమాంధ్ర రాష్ట్రానికి 50 వేల కోట్లతో రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చునని, దానివల్ల సీమాంధ్ర ప్రజలకు మేలు కలుగతుందని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై సిబిఐ దర్యాప్తులో కక్ష సాధింపు లేదని, హైకోర్టు ఆదేశాల మేరకే దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.

English summary
Sabitha Indra Reddy from Telangana reached secretariat after 45 days. Other Telangana ministers may follow her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X