వైయస్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు చేరిన తీరు

- 2010 మార్చి 31 నాటికి జగతి పబ్లికేషన్స్‌లో వివిధ కంపెనీలు, వ్యక్తులు రూ.844.129 కోట్ల పెట్టుబడులు పెట్టారు. వీరంతా ఒక షేరుకు రూ.350 ప్రీమియం చెల్లించారు. వీటిల్లో కొన్ని ఎలాంటి లాభాల్లేని చిన్న కంపెనీలే. వీటిల్లోని వాటాదారులంతా జగన్ బినామీలేననేది ఆరోపణ.
- ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన మరికొందరు వ్యక్తులు కూడా జగతిలో పెట్టుబడిగా పెట్టారనేది ఆరోపణ. ఇలాంటి వారి మొత్తం రూ.60.38 కోట్లు ఉంటుంది. సెజ్‌లో భూమి పొందడం, నీటి ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు, ఇతర అనుమతులు పొందిన వారే వీరంతా.
- దేశంలో పేరెన్నికగన్న దాల్మియా సిమెంట్స్ షేరు విలువ రూ.40, ఇండియా సిమెంట్స్ షేరు విలువ రూ.110 ఉన్నప్పటికీ భారతీ సిమెంట్స్‌లో ఒక్కో షేరుపై వీరు రూ.1440 ప్రీమియం చెల్లించి వాటాలు కొన్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున లబ్ది పొందినందునందుకు నేరుగా ముడుపులు చెల్లించకుండా ఇలా వాటాలు కొన్నారన్నది ఆరోపణ.
- గత రెండేళ్లుగా జగతి పబ్లికేషన్స్ రూ.349 కోట్ల నష్టాల్ని మూటగట్టుకున్నా గతంలో పెట్టుబడి పెట్టిన కంపెనీలే, అదే ప్రీమియానికి షేర్లు కొంటూ, పెట్టుబడుల మొత్తాన్ని రూ.1246 కోట్లకు చేర్చారనేది ఆరోపణ.
- హైదరాబాద్, చెన్నైకి చెందిన 16 స్థానిక కంపెనీలు జగతి పబ్లికేషన్స్, సండూర్ పవర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్‌లో రూ.107 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీలకు ఆ స్థాయిలో ఆదాయం/ఆస్తులు లేవని అంటారు.
- హౌరా, కోల్‌కతా, ముంబయి, రాజ్‌కోట్, బెంగళూరు, ఢిల్లీ, తమిళనాడు ప్రాంతాలకు చెందిన 22 చిన్న కంపెనీలు జగతిలో 195.70 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఇవీ కేవలం కాగితాలపైనే ఉన్నట్లు ఆరోపణ. నల్లధనాన్ని రుణంగా తీసుకుని, అధిక ప్రీమియం చెల్లించి జగతిలో పెట్టుబడిగాపెట్టాయి. అనతికాలంలోనే ఇవి తమ షేర్లను ప్రమోటర్లకు అప్పగించి వెళ్లిపోతాయనేది ఆరోపణ.












Click it and Unblock the Notifications