హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల్లు అరవింద్ చేతిలో చిరు రిమోట్, తమ్ముళ్లు బేజారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Allu Aravind-Chiranjeevi
హైదరాబాద్: బావమరిది అల్లు అరవింద్ చేతిలో చిరంజీవి రిమోట్ ఉందని, అరవింద్ తన అంతిమ లక్ష్యం నెరవేర్చుకోవడానికే కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యనిస్తోంది. చిరంజీవి కాంగ్రెసు తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలో సాక్షి చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. రిమోట్‌ను తన చేతుల్లో పెట్టుకుని చిరంజీవిని నడిపిస్తున్న అల్లు అరవింద్‌పై నాగబాబు, పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారని వ్యాఖ్యానించింది. చిరంజీవి తనను నమ్మిన నాయకులను, కార్యకర్తలను వదిలేసి ఢిల్లీ మహారాణి సేవలో మునిగిపోయారని వ్యాఖ్యానించింది.

వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెసు చేరదీసిన ఆషాఢభూతుల్లో చిరంజీవి ఒకరని, అయితే కాంగ్రెసు ఏరు దాటాక తెప్ప తగిలేస్తుందని వ్యాఖ్యానించింది. అయితే చిరంజీవి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించింది. చిరంజీవి విలీనం నిర్ణయం తీసుకుని ఇంటి మనుషుల ముందే బోనులో నిలబడ్డారని వ్యాఖ్యానించింది. విలీనం నిర్ణయాన్ని చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగంగా వ్యతిరేకించలేక దూరంగా ఉంటున్నట్లు చెప్పింది. విలీనం నిర్ణయం వల్ల, అరవింద్ చర్యల వల్ల చిరంజీవితో తమ్ముళ్లతో విభేదాలు పొడసూపినట్లు సాక్షి వ్యాఖ్యానించింది. వ్యాపార లావాదేవీల్లో, ఆర్థిక వ్యవహారాల్లో కూడా పూర్తిగా విడిపోయినట్లు చెప్పింది.

English summary
YSR Congress party president YS Jagan's Sakshi TV channel made and broadcasted a report opposing Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X