రాష్ట్రంలో భారీ వర్షాలు, హైదరాబాద్ జలమయం

Heavy Rains
హైదరాబాద్: రాష్ట్రంలోని తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల వరకు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గుంటూరులోని పలు ప్రాంతాల జలమయమయ్యాయి. మాచర్ల, గుంటూరు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. గుంటూరు జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని బసవమ్మ వాగు పొంగిపొర్లుతోంది. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల, అచ్చంపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు ఇళ్లల్లోనికి చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ వర్షం పడింది. దీంతో హైదరాబాదులోని రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. చాలా చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరుకుంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ జామ్‌లు చోటు చేసుకున్నాయి. కర్నూలు జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి కుందూనది, పాలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉదృతికి జిల్లాలోని పెద్దయమ్మినగూరు వంతెన కొట్టుకుపోయింది. దీంతో వేలాది ఎకరాల పంట నీటిమునిగింది. అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+