తాళం తీసి దండమూడి ఇంట్లో సిబిఐ సోదాలు

పక్కింటివారి సమక్షంలో సిబిఐ అధికారులు దండమూడి ఇంటి తాళం తెరిచారు. ఆ తర్వాత సోదాలు చేశారు. శనివారం మధ్యాహ్నానికి సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో పలు కీలకమైన పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాదులోని సోమాజిగుడాలో గల రాంకీ కార్యాలయంలో సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాంకీ సంస్థ కూడా జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల బ్యాంక్ ఖాతాలను సిబిఐ అధికారులు పరిశీలిస్తున్నారు.
సికింద్రాబాదులోని ఆల్ఫా విల్లాస్ కార్యాలయంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. మేడ్చల్‌లోని సాక్షి మీడియా గోదాముల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిచారు.












Click it and Unblock the Notifications