అందుకే రాజీనామాలపై జయసుధ, సురేఖ వెనక్కి?

Jayasudha-Konda Surekha
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ తీవ్రత వల్లనే తెలంగాణకు చెందిన ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన మహిళా శాసనసభ్యులు రాజీనామాలు చేయలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యులు సోమవారం రాజీనామాలు చేశారు. అయితే, సికింద్రాబాదు శాసనసభ్యురాలు జయసుధ, వరంగల్ జిల్లా పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ, ఖమ్మం జిల్లా భద్రాచలం శాసనసభ్యురాలు కుంజా సత్యవతి రాజీనామా చేయలేదు. తెలంగాణ కోసం తాము ఇదివరకే రాజీనామా చేసినందున ఇప్పుడు రాజీనామాలు చేయలేదని వారు చెప్పుకున్నారు.

తెలంగాణ శాసనసభ్యులు చేసిన రాజీనామాలను ఇది వరకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అందువల్ల మళ్లీ రాజీనామాలు చేయాలని తెలంగాణవాదులు తమ ప్రాంత శాసనసభ్యులను డిమాండ్ చేస్తున్నారు. దీన్నిబట్టి ఆ ముగ్గురు శాసనసభ్యురాళ్లు కూడా మళ్లీ రాజీనామా చేయాల్సి ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది. అయితే, వారు రాజీనామా చేయకపోవడం వెనక తెలంగాణ ఉద్యమ తీవ్రతనే పనిచేసిందని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం వల్ల ఉప ఎన్నికలు జరిగితే తాము గెలుస్తామో, లేదో అనే అనుమానంతోనే వారు రాజీనామాలు చేయాలేదని అంటున్నారు.

సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తిరుగులేని మెజారిటీ లభిస్తుందని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. అందువల్ల ఉప ఎన్నికలు వస్తే తమ సత్తా చాటాలనే ఉద్దేశంతోనే సీమాంధ్రకు చెందిన 26 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారని భావిస్తున్నారు. వైయస్ జగన్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులుగా శాసనసభలోకి అడుగు పెట్టి నైతిక బలాన్ని సమకూర్చుకునే ఉద్దేశం వారికి ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+