మా ప్రధాన ప్రత్యర్థి టిఆర్ఎస్: జగన్ వర్గం కొండా సురేఖ

తాను ప్రస్తుతం పదవికి రాజీనామా చేయడం లేదని తెలంగాణ బిడ్డగా మొదట తెలంగాణ కోసం చేసిన రాజీనామాకే కట్టుబడి ఉన్నానని కొండా సురేఖ చెప్పారు. వైయస్‌పై కుట్ర చేస్తున్నందుకు నిరసనగా తాను కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెసుతో తెలుగుదేశం కుమ్మక్కైందని అందుకే వారికి ప్రభుత్వం పడిపోదనే విశ్వాసం ఉందన్నారు. రాజీనామాలు ఆమోదింప చేసుకోవడానికి లీగల్‌లా వెళతామని అన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మాటలు చూస్తుంటే కాంగ్రెసు నేతలు ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోందన్నారు.
మమ్మల్ని ఎవరూ మభ్య పెట్టడం లేదన్నారు. కాంగ్రెసు పార్టీయే ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండటానికి కష్టపడుతుందన్నారు. తెలంగాణపై పార్టీ ముసాయిదాలో ఎక్కడా వ్యతిరేకత లేదన్నారు. జగన్ తెలంగాణలో అడుగు పెట్టాక పార్టీ తప్పకుండా పుంజుకుంటుందని అన్నారు. రాజీనామాలు ఆమోదించకపోతే గవర్నర్‌ను కలుస్తామని అన్నారు. గవర్నర్‌ను కలవడం అంటే పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నట్లే అని చెప్పారు.












Click it and Unblock the Notifications