చిరంజీవిని కాంగ్రెసులో దేవుడే కాపాడాలి: శోభా నాగిరెడ్డి

ప్రస్తుతం 29 మందిమి రాజీనామాలు చేయాలనుకుంటున్నామని ఆ సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. బ్లాక్ మెయిల్ చేసే అలవాటు తమకు లేదన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెసు నేతలే అని విమర్శించారు. ఎంతమంది రాజీనామా చేస్తారో మరికొద్ది సేపట్లో తేలనుందన్నారు. ప్రభుత్వం కూలిపోతుందా లేదా అనే పరిణామాలు తర్వాత తేలుతాయన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఎవరు పాల్పడుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్నారు.
నీతివంతులు అవినీతివంతులు ఎవరో ముందు ముందు తేలుతుందన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలంతా భావిస్తున్నారని అన్నారు. వైయస్‌ను అవమానించినందుకు కాంగ్రెసు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జగన్ గురించి మాట్లాడే వారంతా నీతివంతులా అని ప్రశ్నించారు. జగన్ వర్గాన్ని కాంగ్రెసు వారు ఆహ్వానించడమంటే వారి పార్టీ వీక్ అయిపోయినట్టు అర్థమవుతోందన్నారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇన్నాళ్లు హస్తం గుర్తుపై గెలిచి జగన్‌కు మద్దతు పలకడంపై ప్రశ్నించిన కాంగ్రెసు ఇప్పుడు రాజీనామాలు ఆమోదించి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications