స్త్రీని కత్తితో పొడిచి తానూ పొడుచుకున్న యువకుడు

ప్రవీణ్ కుమార్, ప్రశాంతి అనే దంపతులు ఇన్‌కమ్ ట్యాక్స్ రెసిడెన్సీ క్వార్టర్స్‌లో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి ఇంట్లో ఓ పని మనిషి రెండేళ్లుగా పనిచేస్తోంది. తనకు ఆరోగ్యం బాగా లేకపోవడం ఆ పని మనిషి తన మనవడిని పనికి పంపింది. అతనికి దాదాపు 20 ఏళ్లుంటాయి. అయితే, మంగళవారం ప్రశాంతి ఒక్కతే ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఆ యువకుడు ఆమెను వంటగదిలోని కత్తితో పొడిచాడు. ఆమె పెద్దగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. దాంతో అతను తానూ పొడుచుకున్నాడు. ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications