తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య, టిటిడికి బాపిరాజు

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి ఛైర్మన్‌గా నరసాపురం లోక్‌సభ సభ్యుడు కనుమూరి బాపిరాజు నియమితులయ్యారు.ప్రత్యేక సాధికారిక మండలి గడువు ముగియడంతో బాపిరాజును నియమించారు. ఈ పదవికి చిరంజీవి బావమరది అల్లు అరవింద్, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుల పేర్లు వినిపించినప్పటికీ బాపిరాజును ఆ పదవి వరించింది. బాపిరాజు గతంలో రాష్ట్ర దేవాదాయ, ఎక్సైజ్ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. టిటిడి చైర్మన్‌గా బాపిరాజును నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications