వైయస్ జగన్‌పై దాడికి చిరంజీవి రెడీ, జిల్లాల్లో సభలు

ఈ కార్యక్రమాల్లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, చిరంజీవి పాల్గొంటారు. పార్టీలో జిల్లా స్థాయి మొదలుకుని ఎవరికి ఏ ప్రాధాన్యతలు ఇవ్వనున్నారనే దానిపైనా సమావేశంలో బొత్సతో శాసనసభ్యులు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. విలీనాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లే కార్యక్రమాలతో పాటు నేతల ప్రాధాన్యతలపైనా శుక్రవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జగన్‌పై ఎదురుదాడి విషయంలో కాంగ్రెస్‌పార్టీ నేతలు పరిధులు పాటించాల్సి వస్తోంది. వాస్తవానికి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడగట్టుకున్నాడనేది జగన్‌పై ఉన్న ఆరోపణ. దీన్నే ఆధారంగా చేసుకుని జగన్‌పై అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. వైఎస్‌పైనా విరుచుకుపడేందుకు కాంగ్రెస్ నేతలతో పోలిస్తే చిరంజీవికి వెసులుబాటు ఉండడంతో జగన్‌పై దాడికి ఈ జిల్లా పర్యటనలను వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications