కాంగ్రెసు రివర్స్ ఎటాక్: జగన్ వర్గంపై అనర్హత వేటు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికు మచ్చ తెచ్చేలా జగన్ వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యులు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. అందుకే 26మందిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. రాజీనామా చేసిన వారంతా అవినీతికి మద్దతుగా ఒక వ్యక్తి వెనుక నిలబడ్డారన్నారు. కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందన్నారు. ఉప ఎన్నికలు వస్తే కొర్ల భారతి, ధర్మాన కృష్ణదాసుకు దరావత్తు కూడా దక్కదని అన్నారు. కొందరు శాసనసభ్యులు ఇప్పటికే తాము జగన్ వర్గం ట్రాప్‌లో పడ్డామని, ఎలా బయటకు రావాలో తెలియడం లేదని చెబుతున్నారన్నారు.
వారంతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందు తప్పు చేశామని సరెండర్ అయితే చర్యలపై పున పరిశీలిస్తామని చెప్పారు. ఇది నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న పోరు అన్నారు. కాగా తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి బృందం స్పీకర్‌ను కలిశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌కు గులాబీ పువ్వులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications