రాజీవ్ హత్య కేసు: వచ్చే నెల 9న ముగ్గురికి ఉరిశిక్ష

Rajiv Gandhi
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ముగ్గురికి మద్రాసు హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేస్తూ వచ్చే నెల 9వ తేదీన అమలు చేయాలని ఆదేశించింది. పరారీ వలన్, శంతన్, మురగన్‌లకు ఉరిశిక్ష విధించాలని హైకోర్టు ఆదేశించింది. వారు పెట్టుకున్న మెర్సీ పిటిషన్లను రెండు సార్లు రాష్ట్రపతి తిరస్కరించారు. ఇటీవలే రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వారు పెట్టుకున్న మెర్సీ పిటిషన్లను తిరస్కరించారు. దాంతోనే వారికి మరణశిక్ష ఖాయమై పోయింది.

ఇరవై ఏళ్ల క్రితం తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఆ ముగ్గురు కూడా జైలులోనే మగ్గుతున్నారు. ఈ కేసులో నళినికి విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చారు. నళిని మహిళ కావడం, ఆమె పిల్లల తల్లి కావడంతో ఆ వెసులుబాటు ఇచ్చారు. అయితే, ఉరిశిక్షపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సినీ ప్రముఖులు ఉరిశిక్ష అమలు కాకుండా చూసేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఉరిశిక్ష వేయడం దారుణమని ప్రముఖ నటుడు భారతీరాజా అన్నారు. అహింస, మావనత్వానికి మారుపేరైన భారతదేశంలో ఉరిశిక్షను రద్దు చేయాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+