కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు దిశగా రాయపాటి

పార్టీకి తమ అవసరం లేదని భావిస్తున్నామని, గుంటూరు వచ్చి కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానని ఢిల్లీలో ఉన్న ఆయన ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రతినిధితో అన్నారు. గుంటూరు జిల్లాలో పార్టీకి కష్టకాలంలో తాను, తన సోదరుడు శ్రీనివాస్ అండగా నిలిచామని, అయినా గుర్తింపు లభించలేదని ఆయన అన్నారు. గుర్తింపు లభించనప్పుడు పార్టీలో కొనసాగడం ఎంత వరకు భావ్యమని, త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications