ముందు నలుగురు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు

Nadendla Manohar
హైదరాబాద్: ముందుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నలుగురు శాసనసభ్యులపై వేటు విషయంపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ దృష్టి పెడతారని అంటున్నారు. జగన్ వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యుల రాజీనామాలపై దృష్టి పెట్టడానికి ముందు ఆ నలుగురుపై వేటు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులపై పాలక కాంగ్రెసు పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొండా సురేఖ, సి ఆదినారాయణ రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి, ఎ. అమర్నాథ్ రెడ్డిలపై కాంగ్రెసు స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వైయస్సార్ పేరును సిబిఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన 26 మందిలో సురేఖ లేరు. మిగతా ముగ్గురు జగన్‌కు చెందిన కడప జిల్లావారే. ఈ నలుగురు శాసనసభ్యులపై రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

జగన్ వెంట నడుస్తున్న తమ పార్టీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డిలపై తెలుగుదేసం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ నలుగురితో పాటు వీరిద్దరిపై కూడా స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరిద్దరు రాజీనామా చేసిన 26 మందిలో ఉన్నారు. దానికి తోడు స్పీకర్ ఎదుట మరో సమస్య కూడా ఉంది. తెలంగాణ కోసం రాజీనామా చేసిన నాగం జనార్దన్ రెడ్డి, కె. హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాలాచారి రాజీనామాలపై కూడా ఆయన పరిశీలన జరపాల్సి ఉంది. ఈ నలుగురి రాజీనామాలపై పరిశీలించిన తర్వాత జగన్ వర్గానికి చెందిన మిగతా శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+