హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవేందర్ గౌడ్‌ను వైయస్సార్ బ్లాక్ మెయిల్ చేశారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Devender Goud
హైదరాబాద్: హైదరాబాదు శివారులో తలపెట్టిన హార్డ్‌వేర్ పార్కు వ్యవహారంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్‌ను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. దానివల్లనే దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీని అప్పట్లో వీడారని అంటున్నారు. తన బంధువులకు సొంత భూములు ఉన్న చోట హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటుకు దేవేందర్ గౌడ్ అత్యుత్సాహం ప్రదర్శించారని, అందుకు తనకు సంబంధం లేని పరిశ్రమల శాఖలోకి చొరబడ్డారని ఆ పత్రిక రాసింది. ఈ వ్యవహారంపై తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారని, అందులో దేవేందర్ గౌడ్‌ను కూడా చేర్చారని రాసింది. తద్వారా తెలుగుదేశం పార్టీని వీడాలని దేవేందర్ గౌడ్‌పై వైయస్సార్ ఒత్తిడి చేశారని, తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకున్న తర్వాత దేవేందర్ గౌడ్‌కు క్లీన్ చిట్ లభించిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది.

దేవేందర్ గౌడ్ తాను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు 1999 - 2000ల్లో పరిశ్రమల మంత్రితో సంబంధం లేకుండా ఎపిఐఐసి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తుక్కుగుడాకు ఉత్తరం వైపున, రావిర్యాలకు పశ్చిమాన 5 వేల ఎకరాలు హార్డ్‌వేర్ పార్కును ఏర్పాటు చేయడానికి భూమిని సేకరించాలని ఆదేశించారని ఆంధ్రజ్యోతి రాసింది. ఆ స్థలానికి ఆనుకుని దేవేందర్ గౌడ్‌కు, ఆయన బంధువులుక 15 ఎకరాల భూములున్నాయట. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు 274 ఎకరాల భూములున్నాయట. వీటి విలువను పెంచుకునేందుకు హార్డ్‌వేర్ పార్కును అక్కడ ప్రతిపాదించారని ఆరోపణలు వచ్చాయని ఆంధ్రజ్యోతి రాసింది. దీన్ని ఆసరాగా చేసుకుని వైయస్ రాజశేఖర రెడ్డి దేవేందర్ గౌడ్‌ను బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించింది.

ఆ కేసు నుంచి దేవేందర్ గౌడ్‌ను తప్పించడమే కాకుండా సిబిఐ చేసిన సిఫార్సులను కూడా వైయస్ ప్రభుత్వం పట్టించుకోలేదని రాసింది. పైగా, 2008 సెప్టెంబర్ 6వ తేదీన అప్పటి ఎపిఐఐసి ఎఁడి ఎల్వీ సుబ్రమణ్యం, జోనల్ మేనేజర్ దశరథరామిరెడ్డి, ఎస్ మోహన్ రావు‌లపై అభియోగాలను ప్రభుత్వం ఉపబసహంరించుకున్నట్లు ఆంధ్రజ్యోతి రాసింది. ఈ వార్తాకథనంతో దేవేందర్ గౌడ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన శనివారం ఉదయం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చుకున్నారు.

English summary
According to Andhrajyothy daily report - YS Rajasekhar Reddy has blackmailed T Devender Goud on proposed Hardware park issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X