వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారులపై మంత్రి పొన్నాలకు కోపమొచ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో అధికారులపై కోపమొచ్చింది. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని పొన్నాల మండిపడ్డారు. దిగువ మానేరుకు సకాలంలో నీరు విడుదల చేసి ఉంటే ఎనిమిది లక్షల ఎకరాలకు ఉపయోగపడేదన్నారు. ప్రాజెక్టు పూర్తిగా నిండినా, లక్షన్నర క్యూసెక్కుల నీరు సముద్రం పాలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నీటిని విడుదల చేసి లోయరు మానేరు డ్యాంకు తరలించాలన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సిఎం దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు.

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి విడుదలపై తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత వినోద్ కుమార్ సైతం వేరుగా మాట్లాడారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గేట్లు వెంటనే మూసివేసి లోయరు మానేరు డ్యాంకు నీటిని తరలించారని డిమాండ్ చేశారు. నీటిని అనవసరంగా సముద్రం పాలు చేయవద్దన్నారు. కాకతీయ కాలువ, వరద కాలువ ద్వారా నీటిని లోయరు మానేరు డ్యాంకు తరలించాలన్నారు.

English summary
Minister Ponnala Laxmaiah fired at irrigation officers today for not releasing water to Lower Maner dam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X