టిడిఎల్పీలోనే చంద్రబాబు దుమ్ము దులిపిన నాగం

టిడిఎల్పీ మెట్లు ఎక్కవద్దని అనుకున్నామని, స్పీకర్ పుణ్యమా అని ఎక్కాల్సి వచ్చిందని, మీడియా పాయింట్ ఎత్తేయడంతో ఎక్కడ మాట్లాడాలని స్పీకర్‌ను అడిగామని, టిడిఎల్పీని వాడుకోవాలని స్పీకర్ సూచించారని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేసే చంద్రబాబు మార్గదర్శకత్వంలో తెలుగుదేశం తెలంగాణ నేతలు ఎలా న్యాయం చేస్తారని ఆయన అడిగారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం ఎజెండాను ఖరారు చేస్తుందా, అది కాంగ్రెసు అనుబంధ సంస్థగా మారిందా అని ఆయన అడిగారు. ఆత్మాభిమానం లేకపోవడం వల్లనే పార్టీ తెలంగాణ నేతలు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఆంధ్రా భవన్‌గా మారిందని ఆయన అన్నారు. తమ రాజీనామాలను ఆమోదిస్తానని నాదెండ్ల మనోహర్ చెప్పారని, స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications