గాలి వార్తల సాక్షి డైలీ మూత ఖాయం: శంకరరావు

P Shankar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి డైలీ పత్రిక మూత పడుతుందని రాష్ట్ర చేనేత మంత్రి పి. శంకరరావు జోస్యం చెప్పారు. గాలి వార్తలు రాసే సాక్షి దుకాణం బందవుతుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తనపై రాసిన ఓ వార్తను ఉంటంకిస్తూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఆప్కోలో పిఆర్సీ కోసం డబ్బులడిగినట్లు వచ్చిన వార్తపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. తప్పుడు వార్త రాసిన సాక్షి దినపత్రికపై, ఆ వార్త రాసిన మహానుభావుడిపై క్రిమినల్ కేసులు పెడతానని ఆయన హెచ్చరించారు.

హైదరాబాదు అవుటర్ రింగురోడ్డు, జలయజ్ఞం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సిబిఐకి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన దుయ్యబట్టారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్న కాంట్రాక్టరని, ఇప్పుడు బడా కాంట్రాక్టర్ ఎలా అయ్యాడని ఆయన అన్నారు. మంత్రిగా తీసుకోవడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్న అర్హతలేమిటని ఆయన ప్రశ్నించారు. మంత్రులు సరిగా పనిచేయడం లేదని ముఖ్యమంత్రి భావిస్తే అందరి చేత రాజీనామాలు చేయించాలని, వారితో రాజీనామాలు చేయించి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే మరింత చురుగ్గా పనిచేయవచ్చునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+