వైయస్ జగన్‌కు ధీటుగా కెవిపి బలప్రదర్శన?

KVP Ramachandar Rao
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధీటుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు కెవిపి రామచందర్ రావు కాంగ్రెసుకు అనుకూలంగా బలప్రదర్శన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల తనకు చాలామంది ప్రజాప్రతినిధుల మద్దతు ఉందని, వైయస్ఆర్ కాంగ్రెసు సొంతం కాదని వైయస్సార్సీ పార్టీయే ఆయనవారసత్వ పార్టీ అని జగన్ ప్రజల్లోకి తీసుకు వెళుతున్న నేపథ్యంలో కెవిపి ఆయనకు చెక్ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వైయస్ ఎప్పటికీ కాంగ్రెసు సొంతం అని ప్రజల్లోకి, నాయకుల్లోకి తీసుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తద్వారా తన ప్రాధాన్యాన్నీ పార్టీలో కాపాడుకునే ప్రయత్నాలు కెవిపి చేస్తున్నట్టున్నారు.

వైయస్ఆర్‌పై రూపొందించిన వైయస్సాఆర్-మ్యాన్ ఆఫ్ ది పీపుల్ అనే ఛాయాచిత్ర పుస్తకాన్ని కెవిపి మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో జగన్‌కు ధీటుగా ఆయన బలప్రదర్శన చేయనున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఆయన ఒంటిచేత్తో భారీగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులను స్వయంగా వెళ్లి పిలుస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య నేతలు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు వెళ్లనున్నారు. ఢిల్లీ స్థాయిలో సైతం ముఖ్యనేతలు పలువురు రానున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి అద్యక్షురాలు సోనియా గాంధీ రావాల్సి ఉన్నప్పటికీ అస్వస్థతతో విదేశాల్లో ఉన్న కారణంగా గైర్హాజరవుతున్నారు.

కార్యక్రమానికి కాంగ్రెసులో ఉన్న వైయస్సాఆర్ అనుకూలురు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా అధిష్టానంలోని పలువురు వైయస్ అనుకూలురైన ముఖ్య నేతలు రాష్ట్ర కేడర్‌లో వైయస్ వర్గం ప్రాతినిథ్యాన్ని జగన్‌కు ధీటుగా పెంచుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+