జగన్ వర్గం ఎమ్మెల్యేలు కలవరం, రాజీనామాలపై వెనక్కి

రాయబారం నడిపి పరువు కాపాడేలా వ్యవహరిస్తే కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు ఉపసంహరించుకొని, తిరిగి తమతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాము రాజీనామా చేస్తే మరో పదిహేను మంది రాజీనామా చేస్తారని జగన్ సన్నిహితులు చెప్పారని, తీరా చూస్తే ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రస్తుతం రాజీనామాలు ఆమోదిస్తే, ఉప ఎన్నికలు తప్ప ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని వారు అంగీకరిస్తున్నారు. ఎన్నికలను ఎదుర్కోవాలంటే కనీసం రూ.10 కోట్లు ఖర్చుచేయాలని, జగన్ పైసా ఇచ్చే పరిస్థితి లేదని కడప ఎమ్మెల్యేలు అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స.. దమ్ముంటే రాజీనామాలు ఆమోదించుకోవాలని సవాల్ విసిరారని, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి రాజీనామాలు ఉపసంహరింపజేసే ప్రయత్నం చేయాలి తప్పితే ఇలా రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications
