ఈనాడు, బొత్సలపై మండిపడిన వైయస్సార్ కాంగ్రెసు

YS Jaganmohan Reddy
తిరుపతి/ విజయవాడ/అనంతపురం : తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల రాజీనామాలపై ఈనాడు దినపత్రికలో వస్తున్న వార్తాకథనాలపై, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేస్తున్న ప్రకటనలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తారంటూ ఎల్లో మీడియా, కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన గురువారం తిరుపతిలో మండిపడ్డారు. అటువంటి ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టను తగ్గించాలని చూస్తే వందరెట్ల రెట్టింపుతో వెలుగొందుతారన్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వైఎస్‌ఆర్ తీపి గుర్తులను చెరిపివేయటం ఎవరి తరం కాదని భూమన అన్నారు. శుక్రవారం వైఎస్ ద్వితీయ వర్థంతి సందర్భంగా అన్నదానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

వైఎస్ వర్థంతి వేడుకలు జరపాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదేశాలివ్వటంపై అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ఆర్ వర్థంతి వేడుకలను నిర్వహించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన గురువారం అనంతపురంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ వర్థంతిని ఏ హక్కుతో జరుపుతారని ప్రశ్నించారు. స్పీకర్ ఫార్మెట్‌లోని తాము రాజీనామాలు చేశామని, కాంగ్రెస్ పెద్దలకు దమ్ముంటే తమ రాజీనామాలు ఆమోదించేలా ఒత్తిడి తీసుకురావాలని గుర్నాథరెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీ పెద్దలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స ఊడిగం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతలకు వైఎస్‌ఆర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జలీల్‌ఖాన్ అన్నారు. కాంగ్రెస్ నాయకులంతా పవర్ పాలిటిక్స్‌కే గానీ, ఎప్పటికీ ప్రజల నాయకులు కాలేరని ఆయన గురువారం విజయవాడలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+