గాలి అక్రమాల్లో వైయస్ జగన్‌కూ పాత్ర: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్‌: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు శుభపరిణామమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమాల్లో జగన్మోహన్ రెడ్డికి కూడా పాత్ర ఉందని ఆయన అన్నారు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా తాము నిరంతరం పోరాటం చేశామని, పుస్తకాలు అచ్చేశామని, అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి ప్రదర్శించాయని ఆయన అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంపాదించారని ఆయన విమర్శించారు. భూములు, గనులు తదితర వనరులను కట్టబెట్టి వారి నుంచి సాక్షి దినపత్రిక, టీవీ చానెళ్లలో జగన్ పెట్టుబడులు పెట్టించుకున్నారని ఆయన ఆరోపించారు.

గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు మైనింగ్ మాఫియాపై తాము చేస్తున్న పోరాటంలో తొలి విజయమని తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తాము మొదటి నుంచీ పోరాటం చేస్తున్నామని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదికను సిబిఐకి ఇచ్చి గాలి జనార్దన్ రెడ్డి కేసులో సహకరించాలని ఆయన అన్నారు. బిజెపికి మరింత దగ్గరయ్యేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసుకు దగ్గరయ్యేందుకు జగన్ మంతనాలు జరుపుతున్నారని ఆయన అన్నారు.

మైనింగ్ మాఫియాతో వైయస్ జగన్‌కు కూడా భాగం ఉందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి సొమ్మును మొత్తం జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా తాము మొదటి నుంచి పార్లమెంటులో కూడా పోరాటం చేస్తూ వస్తున్నామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+