చిరంజీవి రాజకీయం, త్వరలో సొంత టీవీ చానెల్

కాంగ్రెసు పార్టీలో విలీనమైన ప్రజారాజ్యం ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు శాసనసభ్యులు, మంత్రులు తరచూ చిరంజీవిని కలుస్తున్నారు. వీరంతా భవిష్యత్ అవసరాల కోసమే కలుస్తున్నా మున్ముందు పార్టీలో ఒక ప్రధాన వర్గాన్ని తయారు చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రాంతీయ విలీన సభల పేరుతో జన సమీకరణతో విశాఖపట్నం, గుంటూరు, అనంతపురంలో భారీ బహిరంగ సభల్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి నిర్వహణ బాధ్యతనూ పాత ప్రజారాజ్యం పార్టీ నాయకులకే అప్పగిస్తూ వీటిని బల ప్రదర్శనను చాటుకునేందుకు వేదికలుగా మలచుకోవాలనీ చూస్తున్నారు.












Click it and Unblock the Notifications