గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు: వైయస్ జగన్‌కు దెబ్బ

ఒఎంసి అక్రమాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతర పోరాటం సాగించారు. గాలి జనార్దన్ రెడ్డికి కడప జిల్లా బ్రాహ్మణి స్టీల్స్ కోసం భూమి కేటాయించి, దానికి వాడుకునేందుకు అనంతపురం జిల్లాలో ఒఎంసికి ఇనుప ఖనిజాల గనులను అప్పగించారు. అయితే, ఆ ఇనుప ఖనిజాన్ని కేవలం బ్రాహ్మణి స్టీల్ కోసమే వాడాల్సి ఉండగా, అది ప్రారంభం కాకపోవడంతో గాలి జనార్దన్ రెడ్డికి చెందన ఓఎంసీ ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తూ వచ్చింది. ఒఎంసి అక్రమ తవ్వకాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. గనుల అక్రమాలపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు వైయస్ జగన్‌కు పెద్ద దెబ్బనే కానుంది.












Click it and Unblock the Notifications