గాలి అరెస్టు: చంద్రబాబుకు నైతిక బలం

నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ వెలుపలా, బయటా తీవ్ర పోరాటమే సాగించారు. ఈ పరిస్థితిలోనే గాలి జనార్దన్ రెడ్డి చంద్రబాబుపై, నాగం జనార్దన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో మట్టి కరిపిస్తానని గాలి జనార్దన్ రెడ్డి శపథం చేశారు. రాష్ట రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను మైనింగ్ మాఫియా భ్రష్టు పట్టిస్తోందని చంద్రబాబు ఎప్పటికప్పుడు ధ్వజమెత్తుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీకి సిపిఎం, సిపిఐ మద్దతు కూడా లభించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్‌పై సిబిఐ కేసు పెట్టడం, గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడం తమ విజయంగా చంద్రబాబు చెప్పుకునే అవకాశం ఏర్పడింది.












Click it and Unblock the Notifications