ఉప ఎన్నికలకే మొగ్గు, లాభమని జగన్ అంచనా

సీబీఐ దాడులు, ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరు చేర్చడం, రాజీనామాల అనంతరం క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందనే వంటి వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సీబీఐ దాడులు, కేసులపై ఆందోళన వద్దని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. ఉప ఎన్నికలు జరిగినా లేదా మధ్యంతర ఎన్నికలొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్‌కే ఆదరణ ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజీనామాలను ఆమోదించుకొని ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి ఉపయోగమన్నారు. ఉపఎన్నికల్లో గెలిస్తే పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుందని వివరించారు. దీనివల్ల కడప జిల్లాలోనే జగన్ ప్రభావం ఉందనే విమర్శలకు సమాధానం చెప్పినట్లవుతుందన్నారు.
సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వైఎస్ పేరును కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే చేర్చిందనే అంశం ప్రజల్లోకి వెళ్లిపోయిందని జగన్ అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతలను కలుస్తానని, రెండు రోజులపాటు అక్కడే ఉంటానని వివరించారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని అన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications