జగన్‌పై అందరి దృష్టి, అనూహ్యంగా గాలి అరెస్టు

గాలి జనార్దన్ రెడ్డిని, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని అరెస్టు చేసిన వార్త కొద్ది గంటల్లో గుప్పుమంది. గాలి జనార్దన్ రెడ్డిని ప్రథమ ముద్దాయిగా, శ్రీనివాస రెడ్డిని రెండో ముద్దాయిగా చేర్చిన కేసులో సిబిఐ 85 మంది సాక్షులను విచారించినట్లు సమాచారం. అరెస్టుపై ఉన్న స్టేను సిబిఐ వెకేట్ చేయించుకున్న విషయం కూడా రహస్యంగానే ఉండిపోయింది. సోమవారం మధ్యాహ్నం గాలి సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, అనుచరుడు శ్రీరాములు ఇళ్లలో సిబిఐ సోదాలు చేపట్టింది. గాలి జనార్దన్ రెడ్డి కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు రాజగోపాల్, లక్ష్మిలను సిబిఐ విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications