విజయసాయి రెడ్డిని నాలుగో రోజూ ప్రశ్నించిన సిబిఐ

కాగా, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారంలో వైయస్ జగన్ పాత్రపై కూడా సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి, వైయస్ జగన్‌కు మధ్య గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సాక్షి దినపత్రికలో పెట్టుబడులు పెట్టిన ఆర్ఆర్ గోల్డ్‌కు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గల సంబంధాలను సిబిఐ అధికారులు పసిగట్టినట్లు చెబుతున్నారు. ఆర్ఆర్ గోల్డ్ కార్యాలయం కూడా సాక్షి దినపత్రిక కార్యాలయంలోనే ఉండడాన్ని బట్టి అక్రమాలు జరిగి ఉండవచ్చునని సిబిఐ అధికారులు అనుమానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications