అరెస్టు చేస్తే ప్రభుత్వాన్ని నడవనీయం: కోదండరామ్

తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయడానికి చూస్తోందని విమర్శించారు. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులు గ్రామాలకు రావద్దంటూ బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ వాదులకు సూచించారు. సకల జనుల సమ్మెను విజయవంతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలని కోరుతూ వరంగల్‌లో న్యాయవాదులు డిసిసి కార్యాలయాన్ని ముట్టడించారు. న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications