హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను ఎ-1కు తీసుకు వచ్చారు: పిల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pilli Subhash Chandra Bose
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు ముద్దాయిల జాబితాలో 52వ స్థానంలో ఉండగా ఎ-1కు ఉద్దేశ్య పూర్వకంగా తీసుకు వచ్చారని మాజీ మంత్రి, జగన్ వర్గం శాసనసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసు మంగళవారం ఆరోపించారు. మంగళవారం ఉదయం వారు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ఆయనకు మెమోరాండం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసి అవమానించారని అందుకే తాము పార్టీలో ఉండలేక పోతున్నామని తమ రాజీనామాలు ఆమోదింప చేయాలని గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఆయన అందుకు సానుకూలంగా స్పందించారన్నారు.

తాము ఎమ్మెల్యే పదవులతో పాటు పార్టీ సభ్యత్వాలకు సైతం రాజీనామా చేశామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పాల్పడిన వైయస్ పేరును కక్ష పూరితంగానే ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం దాఖలు చేయలేదని దీనిని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వారిని అణిచి వేయడానికి సిబిఐని ఉపయోగించుకుంటుందన్నారు. ఇది ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదం అన్నారు.

సిబిఐ పనితీరుపై చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ వద్దకు వచ్చారన్నారు. మిగిలిన నలుగురు వ్యక్తిగత కారణాల వల్ల రాలేదన్నారు. కొందరు తమపై అవినీతికి మద్దతుగా రాజీనామాలు చేశారని ఆరోపణలు చేస్తున్నారని అలా అయితే అందరూ రాజీనామాలు చేసి ప్రజా కోర్టుకు రావాలని మరో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మా రాజీనామాలు ఆమోదించాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు.

English summary
YSRC Party president YS Jaganmohan Reddy camp MLA Pilli Subash Chandra Bose accused CBI and Congress party today after governor meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X