వైయస్ మృతితో గాలి జనార్దన్ రెడ్డికి కష్టాలు ప్రారంభం

వైయస్ మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కె. రోశయ్య ఒఎంసి తవ్వకాలను ఆపేయించారు. ఒఎంసిపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకే సిబిఐ మైనింగ్ అక్రమాలపై విచారణ చేపట్టింది. దాంతోనే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు జరిగింది. గాలి సోదరులు స్టే తెచ్చుకున్నారు. అయితే ఆ స్టే 2010 డిసెంబర్‌లో వెకేట్ అయింది. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్ ఏర్పాటుకు వైయస్ రాజశేఖర రెడ్డి భూమిని కేటాయించారు. బ్రాహ్మణి స్టీల్‌కు ముడి ఇనుమును అందించడానికి కాప్టివ్ మైన్స్‌ను కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. అయితే, బ్రాహ్మణి స్టీల్ ప్రారంభమయ్యే వరకు ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసుకోవడానికి ఒఎంసి అనుమతి పొందింది.
బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణాన్ని పక్కన పెట్టేసి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి గణనీయంగా సంపాదించారనే ఆరోపణ ఉంది. తనకు కేటాయించిన మేరకే కాకుండా అటవీ సంరక్షణ చట్టాలను కూడా ఉల్లంఘించి తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. ఇనుప ఖనిజం ఎగుమతుల్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఒఎంసి కర్ణాటకలో కూడా అక్రమ తవ్వకాలను చేపట్టినట్లు మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్జే తన నివేదికలో చెప్పారు. కర్ణాటక అక్రమ మైనింగ్‌పై కూడా ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా సిబిఐ విచారణకు ఆదేశించాలని సంతోష్ హెగ్జే కోరుతున్నారు.












Click it and Unblock the Notifications