ఢిల్లీ హైకోర్టు వద్ద బాంబు పేలుడు, 12 మంది మృతి

ఢిల్లీలో గత మూడు నెలల కాలంలో ఇది రెండో పేలుడు. పేలుడు కారణంగా ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. గేటు నంబర్ 5 వద్ద పేలుడు జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు జరిగిన చోట క్షతగాత్రులు ఎగిరి పడ్డారు. గాయపడ్డ వారిలో పలువురు లాయర్లు కూడా ఉన్నారు. పేలుడు జరగగానే లాయర్లు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి రెండు ఫైరింజన్లు, పోలీసులు, అంబులెన్సు చేరుకున్నాయి. గాయపడ్డ వారిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఓ డబ్బాలో బాంబు పెట్టి కారులో అమర్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో నుండి భారీగా పేలుడు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications