బాన్సువాడపై పార్టీ నిర్ణయానికి కట్టుబడ్తాం: పొన్నం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి తాము తీవ్ర నిరసన వ్యక్తం చేశామని, దీన్ని పార్టీ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నామని తెలంగాణకు చెందిన మరో పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు. ఇంత వరకు తాము సంయమనం పాటించామని, ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన నాయకులు తెలంగాణపై కలిసి చర్చించాలనే ప్రతిపాదనపై తనకు అభ్యంతరం లేదని తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ అన్నారు. సీమాంధ్ర నాయకులతో కలిసి చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా, వాద్దా అనే విషయంపై వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. బాన్సువాడలో అభ్యర్థిని పోటీకి దించే విషయంపై పిసిసి నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమై నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications