వైయస్ జగన్ గడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతల ఫైర్

కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూడా వైయస్ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా వైయస్ జగన్ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కూడా జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము గడ్డి తిని పాలిచ్చే పశువులమైతే వైయస్ జగన్ ఖజానాను దోచుకుని మింగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సహచర పార్లమెంటు సభ్యులపై జగన్ ఆ విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications