బాన్సువాడపై కాంగ్రెసుదీ అదే దారి, పోటీ వద్దంటున్న బొత్స

తెలంగాణకు చెందిన ఎంపీ వివేక్ తదితరులు కూడా నిలబెట్టవద్దని పార్టీకి సూచిస్తున్నారు. బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీ వెళుతున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు, డిస్ట్రిక్ట్ కాంగ్రెసు కమిటీ పునర్వవ్యవస్థీకరణ అంశం అధిష్టానం వద్ద ఆయన చర్చిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు బాన్సువాడ పోటీపై కూడా ఆయన చర్చించనున్నారని సమాచారం. తెలంగాణ సెంటిమెంట్ తీవ్రంగా ఉన్న దృష్ట్యా పోటీ చేయక పోవడమే ఉత్తమమని అధిష్టానానికి చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఉప ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెసు, టిడిపి అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయాన్ని అధిష్టానం దృష్టికి బొత్స తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications