నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాన్సువాడ ఉప ఎన్నికలో పోటీకే కాంగ్రెసు నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్‌: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికలో కాంగ్రెసు పార్టీ పోటీపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటనే నెగ్గింది. తీవ్ర తర్జనభర్జనల తర్వాత బాన్సువాడలో పోటీ చేయాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, శానససభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాన్సువాడలో అభ్యర్థి ఎవరైనా గెలిపించడానికి కృషి చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

బొత్స సత్యనారాయణ సహా డి. శ్రీనివాస్, షబ్బీర్ అలీ బాన్సువాడలో పోటీకి దిగకూడదనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పోటీ చేయాలని భావిస్తూ వస్తున్నారు. చివరకు ముఖ్యమంత్రి మాటనే నెగ్గింది. బాన్సువాడలో పోటీ చేయడానికి ఎనిమిది ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఎనిమిది మందిలో ఎవరు అభ్యర్థి అయినా గెలిపించాలని బొత్స, కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. మండలాలవారీగా సమావేశాలు నిర్వహించి, అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తామని పిసిసి కార్యదర్శి రత్నాకర్ చెప్పారు. ఈ నెల 16, 17 తేదీల్లో బాన్సువాడలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతారు.

కాగా, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ పోటీకి విముఖంగా ఉన్నారు. పార్టీ అభ్యర్థిని పోటీకి దించితే తాను ప్రచారానికి వెళ్లబోనని సమావేశానికి ముందు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. పోటీకి దించకుండా అధిష్టానానికి తెలంగాణపై సంకేతాలు పంపాలని ఆయన సూచించారు. తెలంగాణ స్టీరింగ్ కమిటీ గాడి తప్పిందని ఆయన విమర్శించారు.

English summary
Congress party has decided to contest from Bansuwada assembly seat in Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X