దోచుకుని జగన్ నోట్లు తింటున్నాడు: పొన్నం

సీమాంధ్ర నాయకులకు పదవులు ఇచ్చి తమకు మాత్రం తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తే కాంగ్రెసు పతనమవుతుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు సీమాంధ్ర నాయకులు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయన విమర్శించారు. దానికి సమాధానంగా తాను ఆజాద్‌కు ఆదివారం ఓ నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
హైదరాబాదులో కొత్త సంస్థలు 94 వస్తే వాటిలో 84 సంస్థలు ఇతర ప్రాంతాలవారికి చెందినవేనని, 20 మాత్రమే ఆంధ్ర - తెలంగాణవాళ్లు స్థాపించారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాదు దేశంలో ఐదో అతి పెద్దనగరంగా ఉండేదని, ఇప్పుడు కూడా అదే స్థానంలో ఉందని, అందువల్ల హైదరాబాదును తాము అభివృద్ధి చేశామనే సీమాంధ్రుల వాదనల్లో నిజం లేదని ఆయన అన్నారు.
హైదరాబాదులో హైటెక్ సిటీ మాత్రమే కొత్తగా వచ్చిందని, మిగిలిన అభివృద్ధి అంతా పాతదేనని ఆయన అన్నారు. తెలంగాణలో మాత్రమే ఉందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ ఉప ఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థిని పెట్టకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే, 120 కోట్ల జనాభా ఉన్న మనకు రాష్ట్రాలు వద్దా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications