వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీకి ఊరట, కింది కోర్టుకు అల్లర్ల కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
న్యూఢిల్లీ: గుల్బర్గా సొసైటీ ఊచకోత కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించింది. ఈ కేసుపై తేల్చాల్సింది కింది కోర్టేనని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2002లో గుల్బర్గా సొసైటీ ఊచకోతపై కావాలనే నరేంద్ర మోడీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో గుల్బర్గా ఊచకోతలో కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు ఎషాన్ జాఫ్రీ మరణించారు. ఆయన భార్య జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టులో కేసు వేసింది.

గుల్బర్గా అల్లర్లలో 37 మంది మరణించారు. ఈ సంఘటనపై సిట్ దర్యాప్తు చేసింది. ఈ కేసులో నరేంద్ర మోడీకి సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాది రామచంద్రన్ ఆహ్మదాబాద్‌లో పర్యటించి నివేదిక రూపొందించి కోర్టుకు సమర్పించారు.

English summary
Giving its verdict in the Gulbarg Society massacre case, the Supreme Court on Monday said that it was for the lower court to decide on the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X